1. నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు. [QBR]
2. నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు. [QBR]
3. నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. సెలా
4. నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను. [QBR]
5. గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను, [QBR]
6. ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. [QBR]
7. ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా? [QBR]
8. ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా? [QBR]
9. దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? సెలా
10. ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను. [QBR]
11. అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను. [QBR]
12. నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను. [QBR]
13. దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు? [QBR]
14. నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు. [QBR]
15. నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. సెలా
16. దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి. [QBR]
17. మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి. [QBR]
18. నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది. [QBR]
19. సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు. [QBR]
20. మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు. [PE]