1. {#1యెరూషలేము భవిష్యత్తు }
2. [PS]తిరుగుబాటు పట్టణానికి[* పట్టణానికి యెరూషలేము ] బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది. [PE]
3. [PS]అది దేవుని మాట ఆలకించలేదు. శిక్షకు అంగీకరించ లేదు. [PE][PS]యెహోవా పట్ల విశ్వాసముంచదు. దాని దేవుని దగ్గరికి రాదు. [PE]
4. [PS]దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహాలు. [PE][PS]దాని న్యాయాధిపతులు రాత్రివేళ తిరుగులాడుతూ తెల్లవారేదాకా ఎరలో ఏమీ మిగలకుండా పీక్కు తినే తోడేళ్లు. [PE]
5. [PS]దాని ప్రవక్తలు పెంకెతనం గలవారు, విశ్వాస ఘాతకులు. [PE][PS]దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచేవారు. [PE]
6. [PS]అయితే న్యాయం తీర్చే యెహోవా దాని మధ్య ఉన్నాడు. [PE][PS]ఆయన అక్రమం చేసేవాడు కాడు. [PE][PS]అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులు వెల్లడి చేస్తాడు. [PE][PS]ఆయనకు రహస్యమైనదేమీ లేదు. [PE][PS]అయినా నీతిహీనులకు సిగ్గులేదు. [PE]
7. [PS]నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలు పాడైపోతాయి. [PE][PS]ఒకడైనా సంచరించకుండా వారి వీధులు నిర్మానుష్యమై పోతాయి. [PE][PS]జనసంచారం లేకుండా వాటిలో ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాణ్ణి నేనే. [PE]
8. [PS]దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలం సర్వనాశనం కాకుండేలా, [PE][PS]నాపట్ల భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను గాని, [PE][PS]వారు చెడ్డ పనులు చేయడంలో అత్యాశ గలవారయ్యారు. [PE]
9. [PS]కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే, [PE][PS]“నా కోసం ఎదురు చూడండి. [PE][PS]నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. [PE][PS]నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి, [PE][PS]అన్యజనులను పోగు చేయడానికి, [PE][PS]గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి, [PE][PS]నేను నిశ్చయించుకున్నాను. [PE][PS]నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది. [PE]
10. [PS]అప్పుడు మనుషులంతా యెహోవా నామాన్ని బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించేలా నేను వారికి పవిత్రమైన పెదవులనిస్తాను. [PE]
11. [PS]చెదరి పోయి నాకు ప్రార్థన చేసే నా ప్రజలను కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకు వస్తారు. [PE]
12. [PS]ఆ దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను. [PE][PS]కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు. [PE][PS]నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. [PE]
13. [PS]దుఃఖితులైన దీనులను యెహోవా నామాన్ని ఆశ్రయించే జనశేషంగా నీమధ్య ఉండనిస్తాను. [PE]
14. [PS]ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు. [PE][PS]అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు. [PE][PS]వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.” [PE]
15. [PS]సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి. [PE][PS]ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. [PE][PS]యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. [PE]
16. [PS]మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. [PE][PS]మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. [PE][PS]ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. [PE][PS]ఇక మీదట మీకు అపాయం సంభవించదు. [PE]
17. [PS]ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు. [PE][PS]యెరూషలేమూ, భయపడకు. [PE][PS]సీయోనూ, ధైర్యం తెచ్చుకో. [PE]
18. [PS]నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. [PE][PS]ఆయన శక్తిశాలి. [PE][PS]ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. [PE][PS]ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు. [PE][PS]నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు. [PE]
19. [PS]నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడే నీ బంధువులను నేను సమకూరుస్తాను. [PE][PS]వారు గొప్ప అవమానం పొందిన వారు. [PE]
20. [PS]ఆ కాలమున నిన్ను హింస పెట్టే వారినందరినీ నేను శిక్షిస్తాను. [PE][PS]కుంటుతూ నడిచే వారిని నేను రక్షిస్తాను. [PE][PS]చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. [PE][PS]ఏ యే దేశాల్లో వారు అవమానం పాలయ్యారో అలాటి ప్రతి చోటా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. [PE][PS]ఆ కాలంలో మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోనుండి రప్పించి, [PE][PS]మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. [PE][PS]నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కట్టబెడతాను. [PE][PS]ఇదే యెహోవా వాక్కు.[PE]