2. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను.
|
3. అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
|
5. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువు లతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.
|
7. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతా పము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.
|
8. అప్పుడు హమోరు వారితో షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.
|
12. ఓలియు కట్నమును ఎంతై నను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యు డని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
|
13. అయితే తమ సహో దరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా
|
14. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవ మాన మగును.
|
16. ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము.
|
19. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయు టకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు
|
21. ఈ మనుష్యులు మనతో సమా ధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండ నిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల
|
22. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు.
|
23. వారి మందలు వారిఆస్తి వారి పశువు లన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివ సించెదరనగా
|
24. హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరిగవినిద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.
|
25. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురు షుని చంపిరి.
|
26. వారు హమో రును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి
|
29. వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
|
30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంప
|