పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
రాజులు మొదటి గ్రంథము
1. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను.
2. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను.
3. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.
4. నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.
5. అందుకు రాజుమీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి.
6. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసిఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడు గగా
7. వారుఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.
8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸°వనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను
9. మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?
10. అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ ¸°వనస్థులు ఈ ఆలోచన చెప్పిరినీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్మునా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.
11. నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
12. మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి.
13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸°వనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను
14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
15. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.
16. కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిదావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.
17. అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.
18. తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.
19. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.
20. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
21. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రా యేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను.
22. అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
23. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము
24. యెహోవా సెలవిచ్చునదేమనగాజరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహో దరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.
25. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను.
26. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని
27. యరొ బాము తన హృదయమందు తలంచి
28. ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
29. ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
30. దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
31. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను.
32. మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.
33. ఈ ప్రకా రము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలి పీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రా యేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను.

గమనికలు

No Verse Added

మొత్తం 22 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 12 / 22
రాజులు మొదటి గ్రంథము 12:31
1 రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను. 2 నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను. 3 జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. 4 నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము. 5 అందుకు రాజుమీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి. 6 అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసిఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడు గగా 7 వారుఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. 8 అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸°వనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను 9 మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? 10 అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ ¸°వనస్థులు ఈ ఆలోచన చెప్పిరినీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్మునా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును. 11 నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. 12 మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి. 13 అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸°వనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను 14 నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. 15 జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను. 16 కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిదావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి. 17 అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను. 18 తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను. 19 ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి. 20 మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి. 21 రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రా యేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను. 22 అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 23 నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము 24 యెహోవా సెలవిచ్చునదేమనగాజరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహో దరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. 25 తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. 26 ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని 27 యరొ బాము తన హృదయమందు తలంచి 28 ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; 29 ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. 30 దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. 31 మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను. 32 మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. 33 ఈ ప్రకా రము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలి పీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రా యేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను.
మొత్తం 22 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 12 / 22
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References