3. దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగాశేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడు గాను నిర్జనముగాను చేసెదను.
|
4. నీవు నిర్జనముగా ఉండు నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.
|
5. ఇశ్రాయేలీయుల యెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక
|
6. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసె దను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
|
7. వచ్చువారును పోవువారును లేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.
|
8. అతని పర్వతములను హత మైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయల లోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.
|
9. నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.
|
10. యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశ ములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;
|
11. నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.
|
12. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములనుగురించి పలికిన దూషణ మాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.
|
15. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
|