TEV
25. మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధి కారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.
ERVTE
25. ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నువ్వు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి.
IRVTE
25. ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానంతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN