పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యెహొషువ 20:1

Notes

No Verse Added

యెహొషువ 20:1

1
మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చిన దేమనగా
2
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతెలియ కయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారి పోవుటకు నేను మోషేనోట మీతో పలికించిన ఆశ్రయ పురములను మీరు ఏర్పరచుకొనవలెను.
3
హత్యవిషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును.
4
ఒకడు పురములలో ఒక దానికి పారిపోయి పురద్వార మునొద్ద నిలిచి, పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివ సించుటకు వానికి స్థలమియ్యవలెను.
5
హత్యవిషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి సరహంతుకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు.
6
అతడు తీర్పు నొందుటకై సమాజము నెదుట నిలుచువరకును, తరువాత దినములోనున్న యాజకుడు మరణము నొందువరకును పురములోనే నివసింపవలెను. తరువాత నరహంతకుడు పట్టణమునుండి పారిపోయెనో పట్టణమునకును తన యింటికిని తిరిగి రావలెను.
7
అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.
8
తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.
9
పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకంద రికిని వారిమధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.
×

Alert

×

telugu Letters Keypad References