పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
యెహెజ్కేలు

యెహెజ్కేలు అధ్యాయము 15

ద్రాక్ష చెట్టు ఉపమానం 1 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 2 “నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది? 3 ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా? 4 చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది? 5 చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు! 6 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను. 7 నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8 వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
ద్రాక్ష చెట్టు ఉపమానం 1 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. .::. 2 “నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది? .::. 3 ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా? .::. 4 చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది? .::. 5 చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు! .::. 6 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను. .::. 7 నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. .::. 8 వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
  • యెహెజ్కేలు అధ్యాయము 1  
  • యెహెజ్కేలు అధ్యాయము 2  
  • యెహెజ్కేలు అధ్యాయము 3  
  • యెహెజ్కేలు అధ్యాయము 4  
  • యెహెజ్కేలు అధ్యాయము 5  
  • యెహెజ్కేలు అధ్యాయము 6  
  • యెహెజ్కేలు అధ్యాయము 7  
  • యెహెజ్కేలు అధ్యాయము 8  
  • యెహెజ్కేలు అధ్యాయము 9  
  • యెహెజ్కేలు అధ్యాయము 10  
  • యెహెజ్కేలు అధ్యాయము 11  
  • యెహెజ్కేలు అధ్యాయము 12  
  • యెహెజ్కేలు అధ్యాయము 13  
  • యెహెజ్కేలు అధ్యాయము 14  
  • యెహెజ్కేలు అధ్యాయము 15  
  • యెహెజ్కేలు అధ్యాయము 16  
  • యెహెజ్కేలు అధ్యాయము 17  
  • యెహెజ్కేలు అధ్యాయము 18  
  • యెహెజ్కేలు అధ్యాయము 19  
  • యెహెజ్కేలు అధ్యాయము 20  
  • యెహెజ్కేలు అధ్యాయము 21  
  • యెహెజ్కేలు అధ్యాయము 22  
  • యెహెజ్కేలు అధ్యాయము 23  
  • యెహెజ్కేలు అధ్యాయము 24  
  • యెహెజ్కేలు అధ్యాయము 25  
  • యెహెజ్కేలు అధ్యాయము 26  
  • యెహెజ్కేలు అధ్యాయము 27  
  • యెహెజ్కేలు అధ్యాయము 28  
  • యెహెజ్కేలు అధ్యాయము 29  
  • యెహెజ్కేలు అధ్యాయము 30  
  • యెహెజ్కేలు అధ్యాయము 31  
  • యెహెజ్కేలు అధ్యాయము 32  
  • యెహెజ్కేలు అధ్యాయము 33  
  • యెహెజ్కేలు అధ్యాయము 34  
  • యెహెజ్కేలు అధ్యాయము 35  
  • యెహెజ్కేలు అధ్యాయము 36  
  • యెహెజ్కేలు అధ్యాయము 37  
  • యెహెజ్కేలు అధ్యాయము 38  
  • యెహెజ్కేలు అధ్యాయము 39  
  • యెహెజ్కేలు అధ్యాయము 40  
  • యెహెజ్కేలు అధ్యాయము 41  
  • యెహెజ్కేలు అధ్యాయము 42  
  • యెహెజ్కేలు అధ్యాయము 43  
  • యెహెజ్కేలు అధ్యాయము 44  
  • యెహెజ్కేలు అధ్యాయము 45  
  • యెహెజ్కేలు అధ్యాయము 46  
  • యెహెజ్కేలు అధ్యాయము 47  
  • యెహెజ్కేలు అధ్యాయము 48  
×

Alert

×

Telugu Letters Keypad References