పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
యెహెజ్కేలు

యెహెజ్కేలు అధ్యాయము 22

యెరూషలేము పాపాలు 1 యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఇలా అన్నాడు, 2 “నరపుత్రుడా, తీర్పు తీరుస్తావా? ఈ రక్తపు పట్టణానికి తీర్పు తీరుస్తావా? దాని అసహ్యమైన పనులన్నీ దానికి తెలియజెయ్యి. 3 నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం! 4 రక్తం కార్చిన కారణంగా నువ్వు నేరం చేశావు. నువ్వు చేసుకున్న విగ్రహాల మూలంగా నువ్వు అశుద్ధం అయ్యావు! నువ్వే నీ దినాలు ముగింపుకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ఆఖరి సంవత్సరాల్లో ఉన్నావు. కాబట్టి అన్యప్రజల్లో ఒక నిందగానూ, అన్ని దేశాల దృష్టిలో ఒక ఎగతాళిగానూ నిన్ను చేస్తాను. 5 దగ్గర వాళ్ళూ, దూరం వాళ్ళు అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఓ అపవిత్ర పట్టణమా, నువ్వు గందరగోళంతో నిండిన దానివన్న కీర్తి అందరికీ పాకింది. 6 నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు. 7 నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు. 8 నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను నువ్వు అలక్ష్యం చేశావు. నా విశ్రాంతిదినాలను అపవిత్రం చేశావు. 9 దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు. 10 తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు. 11 ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు. 12 వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 13 “కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను. 14 నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను. 15 కాబట్టి అన్యప్రజల్లోకి నిన్ను చెదరగొడతాను. ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను. ఈ విధంగా నీ అపవిత్రతను ప్రక్షాళన చేస్తాను. 16 కాబట్టి నువ్వు అన్యదేశాల దృషిలో అశుద్ధం ఔతావు. అప్పుడు నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.” 17 తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. 18 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.” 19 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు, 20 నా కోపంతోనూ, ఉగ్రతతోనూ మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిస్తాను. 21 మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు. 22 కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.” 23 యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు, 24 “నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు! 25 అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు. 26 27 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు. నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను అపవిత్రం చేస్తారు. ప్రతిష్ఠితమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడాన్ని ప్రజలకు నేర్పరు. వాళ్ళ మధ్య నేను దూషణ పొందేలా, నేను విధించిన విశ్రాంతి దినాలను వాళ్ళ దృష్టికి రానివ్వరు. దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు. 28 దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు. 29 30 దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు. నేను దేశాన్ని పాడు చెయ్యకుండా ఉండేలా గోడలు కట్టి, బద్దలైన గోడ సందుల్లో నిలిచి ఉండడానికి తగిన వాడి కోసం నేను ఎంత చూసినా, ఒక్కడైనా నాకు కనిపించలేదు. 31 కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యెరూషలేము పాపాలు 1 యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఇలా అన్నాడు, .::. 2 “నరపుత్రుడా, తీర్పు తీరుస్తావా? ఈ రక్తపు పట్టణానికి తీర్పు తీరుస్తావా? దాని అసహ్యమైన పనులన్నీ దానికి తెలియజెయ్యి. .::. 3 నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం! .::. 4 రక్తం కార్చిన కారణంగా నువ్వు నేరం చేశావు. నువ్వు చేసుకున్న విగ్రహాల మూలంగా నువ్వు అశుద్ధం అయ్యావు! నువ్వే నీ దినాలు ముగింపుకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ఆఖరి సంవత్సరాల్లో ఉన్నావు. కాబట్టి అన్యప్రజల్లో ఒక నిందగానూ, అన్ని దేశాల దృష్టిలో ఒక ఎగతాళిగానూ నిన్ను చేస్తాను. .::. 5 దగ్గర వాళ్ళూ, దూరం వాళ్ళు అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఓ అపవిత్ర పట్టణమా, నువ్వు గందరగోళంతో నిండిన దానివన్న కీర్తి అందరికీ పాకింది. .::. 6 నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు. .::. 7 నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు. .::. 8 నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను నువ్వు అలక్ష్యం చేశావు. నా విశ్రాంతిదినాలను అపవిత్రం చేశావు. .::. 9 దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు. .::. 10 తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు. .::. 11 ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు. .::. 12 వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. .::. 13 “కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను. .::. 14 నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను. .::. 15 కాబట్టి అన్యప్రజల్లోకి నిన్ను చెదరగొడతాను. ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను. ఈ విధంగా నీ అపవిత్రతను ప్రక్షాళన చేస్తాను. .::. 16 కాబట్టి నువ్వు అన్యదేశాల దృషిలో అశుద్ధం ఔతావు. అప్పుడు నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.” .::. 17 తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. .::. 18 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.” .::. 19 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు, .::. 20 నా కోపంతోనూ, ఉగ్రతతోనూ మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిస్తాను. .::. 21 మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు. .::. 22 కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.” .::. 23 యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు, .::. 24 “నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు! .::. 25 అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు. .::. 26 .::. 27 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు. నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను అపవిత్రం చేస్తారు. ప్రతిష్ఠితమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడాన్ని ప్రజలకు నేర్పరు. వాళ్ళ మధ్య నేను దూషణ పొందేలా, నేను విధించిన విశ్రాంతి దినాలను వాళ్ళ దృష్టికి రానివ్వరు. దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు. .::. 28 దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు. .::. 29 .::. 30 దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు. నేను దేశాన్ని పాడు చెయ్యకుండా ఉండేలా గోడలు కట్టి, బద్దలైన గోడ సందుల్లో నిలిచి ఉండడానికి తగిన వాడి కోసం నేను ఎంత చూసినా, ఒక్కడైనా నాకు కనిపించలేదు. .::. 31 కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
  • యెహెజ్కేలు అధ్యాయము 1  
  • యెహెజ్కేలు అధ్యాయము 2  
  • యెహెజ్కేలు అధ్యాయము 3  
  • యెహెజ్కేలు అధ్యాయము 4  
  • యెహెజ్కేలు అధ్యాయము 5  
  • యెహెజ్కేలు అధ్యాయము 6  
  • యెహెజ్కేలు అధ్యాయము 7  
  • యెహెజ్కేలు అధ్యాయము 8  
  • యెహెజ్కేలు అధ్యాయము 9  
  • యెహెజ్కేలు అధ్యాయము 10  
  • యెహెజ్కేలు అధ్యాయము 11  
  • యెహెజ్కేలు అధ్యాయము 12  
  • యెహెజ్కేలు అధ్యాయము 13  
  • యెహెజ్కేలు అధ్యాయము 14  
  • యెహెజ్కేలు అధ్యాయము 15  
  • యెహెజ్కేలు అధ్యాయము 16  
  • యెహెజ్కేలు అధ్యాయము 17  
  • యెహెజ్కేలు అధ్యాయము 18  
  • యెహెజ్కేలు అధ్యాయము 19  
  • యెహెజ్కేలు అధ్యాయము 20  
  • యెహెజ్కేలు అధ్యాయము 21  
  • యెహెజ్కేలు అధ్యాయము 22  
  • యెహెజ్కేలు అధ్యాయము 23  
  • యెహెజ్కేలు అధ్యాయము 24  
  • యెహెజ్కేలు అధ్యాయము 25  
  • యెహెజ్కేలు అధ్యాయము 26  
  • యెహెజ్కేలు అధ్యాయము 27  
  • యెహెజ్కేలు అధ్యాయము 28  
  • యెహెజ్కేలు అధ్యాయము 29  
  • యెహెజ్కేలు అధ్యాయము 30  
  • యెహెజ్కేలు అధ్యాయము 31  
  • యెహెజ్కేలు అధ్యాయము 32  
  • యెహెజ్కేలు అధ్యాయము 33  
  • యెహెజ్కేలు అధ్యాయము 34  
  • యెహెజ్కేలు అధ్యాయము 35  
  • యెహెజ్కేలు అధ్యాయము 36  
  • యెహెజ్కేలు అధ్యాయము 37  
  • యెహెజ్కేలు అధ్యాయము 38  
  • యెహెజ్కేలు అధ్యాయము 39  
  • యెహెజ్కేలు అధ్యాయము 40  
  • యెహెజ్కేలు అధ్యాయము 41  
  • యెహెజ్కేలు అధ్యాయము 42  
  • యెహెజ్కేలు అధ్యాయము 43  
  • యెహెజ్కేలు అధ్యాయము 44  
  • యెహెజ్కేలు అధ్యాయము 45  
  • యెహెజ్కేలు అధ్యాయము 46  
  • యెహెజ్కేలు అధ్యాయము 47  
  • యెహెజ్కేలు అధ్యాయము 48  
×

Alert

×

Telugu Letters Keypad References