పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
కీర్తనల గ్రంథము

కీర్తనల గ్రంథము అధ్యాయము 104

1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. 2 ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. 3 జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. 4 వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు. 5 భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. 6 దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. 7 నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి. 8 నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి. 9 అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు. 10 ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి. 11 అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి. 12 వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి. 13 తన మేడ గదుల్లోనుండి* మేడ గదుల్లోనుండి ఆకాశంలోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది. 14 పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు 15 అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు. 16 యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి. 17 అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి. 18 ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు. 19 ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు. 20 నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి. 21 సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి. 22 సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి. 23 సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు. 24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. 25 అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి. 26 అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి చూడండి: కీర్త. 74:17 . 27 తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి. 28 నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి. 29 నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి. 30 నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు. 31 యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక. 32 ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి. 33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను. 34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను. 35 పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.
1. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. 2. ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. 3. జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. 4. వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు. 5. భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. 6. దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. 7. నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి. 8. నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి. 9. అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు. 10. ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి. 11. అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి. 12. వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి. 13. తన మేడ గదుల్లోనుండి[* మేడ గదుల్లోనుండి ఆకాశంలోనుండి ] ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది. 14. పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు 15. అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు. 16. యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి. 17. అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి. 18. ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు. 19. ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు. 20. నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి. 21. సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి. 22. సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి. 23. సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు. 24. యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. 25. అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి. 26. అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి[† చూడండి: కీర్త. 74:17 ]. 27. తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి. 28. నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి. 29. నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి. 30. నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు. 31. యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక. 32. ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి. 33. నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను. 34. ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను. 35. పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 1  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 2  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 3  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 4  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 5  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 6  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 7  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 8  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 9  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 10  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 11  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 12  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 13  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 14  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 15  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 16  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 17  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 18  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 19  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 20  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 21  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 22  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 23  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 24  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 25  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 26  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 27  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 28  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 29  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 30  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 31  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 32  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 33  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 34  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 35  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 36  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 37  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 38  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 39  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 40  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 41  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 42  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 43  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 44  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 45  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 46  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 47  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 48  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 49  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 50  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 51  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 52  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 53  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 54  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 55  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 56  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 57  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 58  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 59  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 60  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 61  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 62  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 63  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 64  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 65  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 66  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 67  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 68  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 69  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 70  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 71  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 72  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 73  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 74  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 75  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 76  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 77  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 78  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 79  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 80  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 81  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 82  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 83  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 84  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 85  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 86  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 87  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 88  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 89  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 90  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 91  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 92  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 93  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 94  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 95  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 96  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 97  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 98  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 99  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 100  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 101  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 102  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 103  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 104  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 105  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 106  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 107  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 108  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 109  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 110  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 111  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 112  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 113  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 114  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 115  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 116  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 117  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 118  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 119  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 120  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 121  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 122  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 123  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 124  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 125  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 126  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 127  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 128  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 129  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 130  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 131  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 132  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 133  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 134  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 135  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 136  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 137  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 138  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 139  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 140  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 141  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 142  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 143  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 144  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 145  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 146  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 147  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 148  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 149  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 150  
×

Alert

×

Telugu Letters Keypad References