2. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
|
5. అయితే వారుఇతడు గలిలయదేశము మొద లుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
|
7. ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
|
8. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను.
|
11. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
|
14. ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ
|
15. హేరోదునకు కూడ కనబడలేదు.హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
|
22. మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
|
25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
|
26. వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
|
27. గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
|
28. యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
|
29. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
|
33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
|
34. యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
|
35. ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతానురక్షించుకొనునని అపహసించిరి.
|
39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచునీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.
|
41. మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
|
46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
|
49. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబ డించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
|
51. అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు.
|
53. దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
|
56. తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
|