10. నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది. |
12. {జ్ఞానము కలిగి ఉండటం} PS “నేను జ్ఞానాన్ని,
నేను మంచి తీర్పుతో జీవిస్తాను. తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు. |
13. ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను. చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం. |
14. కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
తెలివీ శక్తిని నేను వారికి ఇస్తాను! |
15. రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. |
17. నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు. |
18. నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. |
20. నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. |
21. నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను. |
26. యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను. |
27. యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. |
28. ఆకాశంలో యెహోవా మేఘాలను
ఉంచకముందే నేను పుట్టాను. మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. |
29. సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. |
30. నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. |
36. అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి
తనకు తానే హాని చేసుకొనును. నన్ను అసహ్యించు కొనువారు మరణమును ప్రేమించెదరు.” PE |