పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
కీర్తనల గ్రంథము
1. దేవా నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2. దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3. నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4. నాలో నా గుండె ఆదురుతోంది . నాకు చచ్చి పోయేటంత భయంగా ఉంది.
5. నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను.
6. ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7. నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8. నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9. నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10. పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి. ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11. వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12. ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే దానిని నేను భరించగలను. ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే నేను దాక్కోగలను.
13. కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. ఎందుకంటే నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14. మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము. దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15. నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
16. నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17. సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబతాను. ఆయన నా మాట వింటాడు.
18. నేను చాలా యుద్ధాలు చేశాను. కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వస్తాడు.
19. దేవుడు అనాటి కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు. నా శత్రువులు వారి బతుకులు మార్చుకోరు. వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20. నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21. అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు. కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు. వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.
22. నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23. కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి అణచివేస్తావు.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 55 of Total Chapters 150
కీర్తనల గ్రంథము 55:11
1. దేవా నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2. దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3. నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4. నాలో నా గుండె ఆదురుతోంది . నాకు చచ్చి పోయేటంత భయంగా ఉంది.
5. నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను.
6. ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7. నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8. నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9. నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10. పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి. పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11. వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12. ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే దానిని నేను భరించగలను. ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే నేను దాక్కోగలను.
13. కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. ఎందుకంటే నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14. మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము. దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15. నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
16. నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17. సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబతాను. ఆయన నా మాట వింటాడు.
18. నేను చాలా యుద్ధాలు చేశాను. కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వస్తాడు.
19. దేవుడు అనాటి కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు. నా శత్రువులు వారి బతుకులు మార్చుకోరు. వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20. నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21. అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు. కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు. వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని మాటలు కత్తిలా కోస్తాయి.
22. నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23. కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి అణచివేస్తావు.
Total 150 Chapters, Current Chapter 55 of Total Chapters 150
×

Alert

×

telugu Letters Keypad References